: ఇద్దరు సీఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తా: గవర్నర్ నరసింహన్


రాజ్ భవన్ లో నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా కొనసాగాయి. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులను పలువురు ప్రముఖులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ, కొత్త సంవత్సరంలో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని... అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News