: తీవ్రవాది లఖ్వీ బెయిల్ పై పాక్ సవాల్
26/11 ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ బెయిల్ పై పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. డిసెంబర్ 18న పాక్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేసింది. దానిపై భారత్ సహా పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో, విడుదలైన వెంటనే లఖ్వీని అదుపులోకి తీసుకున్న పాక్ పోలీసులు కొత్త కేసు నమోదు చేశారు.