: పెళ్లి వేడుకలో విషాదం నింపిన 'రాకెట్'


నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించిన అనంతరం, తాలిబన్లు ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో హెల్మంద్ ప్రాంతంలోని సంగిన్ ప్రావిన్స్ లో ప్రభుత్వ దళాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన పోరు సందర్భంగా, ఓ రాకెట్ పెళ్లి వేడుకలో విషాదం నింపింది. రాకెట్ దూసుకురావడంతో పెళ్లికి హాజరైన అతిథుల్లో కనీసం 15 మంది వరకు మరణించినట్టు పోలీసులు వర్గాలు తెలిపాయి. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులని తెలుస్తోంది. 45 మంది గాయపడ్డట్టు సమాచారం. సంగిన్ ప్రావిన్స్ తాలిబన్లకు బాగా పట్టున్న ప్రాంతం. అమెరికా, బ్రిటీష్ దళాలు తీవ్రంగా పోరాడినా ఇక్కడ తాలిబన్లను నిర్మూలించలేకపోయాయి.

  • Loading...

More Telugu News