: 2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీ: చంద్రబాబు
6 నెలల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఎన్నో అభివృద్ధి పనులను చేపడుతున్నామని... ఇబ్బందులున్నా రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. 24 గంటలు విద్యుత్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదే అని చంద్రబాబు తెలిపారు. 2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీ తయారవుతుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గొప్పగా ఆదరించారని... అదే సమయంలో కాంగ్రెస్ పై కసి తీర్చుకున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన సరైన రీతలో జరగలేదని మండిపడ్డారు. అప్పులను జనాభా ప్రాతిపదికన విభజించిన వారు... ఆదాయాన్ని మాత్రం జనాభా ప్రాతిపదికన విభజించలేదని విమర్శించారు. విజయవాడలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు పైవ్యాఖ్యలు చేశారు.