: నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో, కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, మేయర్ శ్రీధర్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు. అంతకు ముందు బెజవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.