: వాకింగ్ కు వెళ్తే వజ్రం దొరికింది
అదృష్టం అంటే అతనిదే. విశ్వాసానికి మారుపేరైన శునకాలు ఓ బ్రిటన్ పెద్దాయనను లక్షాధికారిని చేశాయి. లింకన్ షైర్, బ్రాటిల్బీ ప్రాంతానికి చెందిన అలెన్ బెల్ తన పెంపుడు కుక్కలను తీసుకొని వాకింగ్ కు వెళ్ళాడు. ఒక పొద వద్ద ఆ కుక్కలు ఆగి దేన్నో బయటకు తీయడానికి ప్రయత్నించాయి. ఏంటా అని చూసిన బెల్ కు ఒక వజ్రం కనిపించింది. దీని విలువ రూ.12 లక్షలని తెలుస్తోంది. ఈ వజ్రాన్ని ‘77డైమండ్స్' అనే ఆన్ లైన్ వ్యాపార సంస్థ ప్రచార నిమిత్తం హీలియం బెలూన్ ద్వారా ఆకాశంలోకి పంపింది. ఆకాశం అంచుల్లోకి వెళ్ళిన బెలూన్ పేలిపోగా వజ్రం కిందపడింది. ఇది ఎవరికీ దొరికితే వారు తీసుకోవచ్చని ఆ సంస్థ ముందే ప్రకటించింది.