: బంగాళాఖాతంలో అలల ఉద్ధృతి... వణుకుతున్న తీరప్రాంతం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా అలల ఉద్ధృతి అధికంగా ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీరం వెంబడి రెండు మీటర్ల వరకూ ఎత్తైన అలలు వస్తుండటంతో వందలాది మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు వద్ద అలల ఉద్ధృతికి బోట్లు గల్లంతయ్యాయని మత్స్యకారులు తెలిపారు. మచినీళ్లపేట వద్ద లంగరువేసి నిలిపి ఉంచిన బోట్లు కూడా కొట్టుకుపోయాయని బాధితులు తెలిపారు.