: పబ్ లపై దాడి చేసి యువతీ యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సమయం దాటినా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగితేలుతున్న వారిపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు. నిర్దేశిత సమయం మించిపోయినా నడుస్తున్న పలు పబ్ లపై దాడులు చేశారు. పబ్ లో ఎంజాయ్ చేస్తున్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఒంటి గంట వరకే అనుమతి ఉన్నా... తెల్లవారుజాము వరకు పబ్ లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, 400 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 400 వాహనాలను సీజ్ చేశారు.