: అసెంబ్లీ ముందు భూములు కబ్జా చేసినా, పట్టాలు ఇస్తారా?: షబ్బీర్ అలీ
తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ గత కొద్ది రోజులుగా తరచుగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. పట్టాలు లేని భూములను క్రమబద్ధం చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబడుతున్నారు. పేదల భూములను క్రమబద్ధం చేస్తే తమకు అభ్యంతరం లేదని... ధనికులకు ప్రయోజనం కలిగేలా వచ్చిన జీవోపై తమకు అనేక సందేహాలు ఉన్నాయని అన్నారు. అన్ని భూములను క్రమబద్ధీకరించాలనుకోవడం, భూ కబ్జాలకు పాల్పడిన వారికి మేలు చేసేలా ఉందని షబ్బీర్ మండిపడ్డారు. అసెంబ్లీ ముందున్న భూమిని కబ్జా చేసిన వారికి కూడా ప్రభుత్వం పట్టాలు ఇస్తుందా? అని ప్రశ్నించారు.