: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, జగన్
తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటలో నడవాలని చంద్రబాబు అభిలషించారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలంతా కలసిమెలసి జీవించాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. కొత్త సంవత్సరం అందరికీ చిరస్మరణీయం కావాలని జగన్ ఆకాంక్షించారు.