: ఏపీ సీఎం చంద్రబాబు సరికొత్త రీతిలో కొత్త సంవత్సర వేడుకలు
పాలనలో తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలను కూడా సరికొత్తగా నిర్వహించుకుంటున్నారు. ఏటా కొత్త సంవత్సరాదిన ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతూ వస్తున్న ఆయన, తాజాగా నూతన సంవత్సర వేడుకలను నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని తుళ్లూరులో జరిగే ఓ కార్యక్రమంలో జరుపుకోనున్నారు. ఈ మేరకు సీఎం నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు.