: 2014లో స్వామివారి హుండీ ఆదాయం 832 కోట్లు


2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం 831 కోట్ల 90 లక్షల రూపాయలని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ ఏడాది 2 కోట్ల 26 లక్షల 12 వేల మంది భక్తులు కలియుగ దైవాన్ని దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. కోటీ 15 లక్షల మందికి పైగా భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకున్నారు. దాదాపుగా తొమ్మిది కోట్ల లడ్డూలను ప్రసాదంగా విక్రయించినట్టు టీటీడీ తెలిపింది.

  • Loading...

More Telugu News