: న్యాయమూర్తుల నియామక కమిషన్ కు రాష్ట్రపతి ఆమోదం


నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్ మెంట్స్ కమిషన్ కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ అధికారికంగా నేటి నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో, వెంటనే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రక్రియను కమిషన్ ప్రారంభించనుంది. కొలిజీయం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నియామకాల కమిషన్ బిల్లుకు ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆరుగురు సభ్యులుండే ఈ కమిషన్ లో ఇద్దరు సీనియర్ జడ్జిలు, న్యాయశాఖ మంత్రి, ఇద్దరు ప్రముఖ పౌరులు ఉంటారు. దానికి దేశ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు.

  • Loading...

More Telugu News