: ఇండియన్ కంపెనీపై మైక్రోసాఫ్ట్ దావా


తమ సంస్థ పేరు చెప్పుకొని వ్యాపారం నిర్వహిస్తోందంటూ భారత్ కు చెందిన సి-క్యూబ్డ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై మైక్రోసాఫ్ట్ అమెరికా కోర్టులో దావా వేసింది. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులకు సాంకేతిక మద్దతు ఇచ్చేందుకు తమకు అనుమతి ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా పలు చిన్నాచితకా కంపెనీలు యూజర్లను మోసగిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇంతకాలం చూసీ చూడనట్టు వ్యవహరించిన మైక్రోసాఫ్ట్ ఇకపై కఠినంగా ఉండాలని నిర్ణయించింది. ఈ టెక్నికల్ సపోర్ట్ కుంభకోణం కారణంగా ఏటా 33 లక్షల మంది అమెరికన్లు బాధితులవుతున్నారని, సుమారు రూ.9500 కోట్లు నష్టపోతున్నామని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News