: చితక్కొట్టి అరెస్టులొద్దన్నారు!


కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం సర్దాపూర్ లో విద్యార్థులను టీఆర్ఎస్ కార్యకర్తలు చితక్కొట్టారు. వివరాల్లోకెళితే... మంగళవారం నాడు సర్దాపూర్ గ్రామంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన శంకుస్థాపనకు మంత్రులు కేటీఆర్, పోచారం వచ్చారు. దీంతో, గతవారం రోజులుగా ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులతో కలిసి వచ్చి మంత్రుల కాన్వాయ్ ని అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు విద్యార్థులపైకి ఆగ్రహంతో లంఘించారు. దొరికిన వారిని దొరికినట్టు చితకబాదారు. ఎవరు? ఎందుకు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా కొడుతున్నారో తెలియని విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. వారు తేరుకునేలోపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, అక్కడే ఉన్న పోలీసులు 31 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అంతా పూర్తైన తరువాత మంత్రి కేటీఆర్ విద్యార్థులపై కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు చెప్పడం కొసమెరుపు.

  • Loading...

More Telugu News