: రాజధాని ప్రాంతంలో రైతులు అఫిడవిట్లు ఇవ్వొద్దు: జన చైతన్య వేదిక


సంవత్సరానికి మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం అప్పగిస్తూ రైతులు అఫిడవిట్లు ఇవ్వొద్దని జన చైతన్య వేదిక సూచించింది. ఆహార భద్రతను కాపాడేందుకు రైతులు నడుంబిగించాలని జన చైతన్య వేదిక అధ్యక్షుడు జస్టిస్ లక్ష్మణరెడ్డి కోరారు. కేంద్రం భూసేకరణ చట్ట సవరణతో రైతు ప్రయోజనాలను దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. తుళ్లూరు, ఉండవల్లి ప్రాంతాల్లో రైతుల పంటలు, ఆస్తులను తగులబెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే ప్రభుత్వం పరిహారం చెల్లించాలని లక్ష్మణరెడ్డి కోరారు.

  • Loading...

More Telugu News