: ‘పీకే’కు యూపీలో పన్ను మినహాయింపు... చిత్రంపై దర్యాప్తు లేదన్న ‘మహా’ సర్కారు


హిందుత్వ వాదుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తాజా చిత్రం ‘పీకే’కు వినోద పన్ను నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా ఈ చిత్ర బృందానికి అఖిలేశ్ యాదవ్ సర్కారు మరింత ఊపునిచ్చినట్లైంది. ఇదిలా ఉంటే, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రంపై విచారణకు ఆదేశించాలన్న కొన్ని వర్గాల డిమాండ్లను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తోసిపుచ్చారు. ‘పీకే’పై ఎలాంటి విచారణకు ఆదేశించేది లేదని ఆయన కొద్దిసేపటి క్రితం తేల్చిచెప్పారు.

  • Loading...

More Telugu News