: ఇప్పుడు 'గోపాల గోపాల'కు వీహెచ్ పీ సెగ


ఓ వైపు 'పీకే' చిత్రంపై విశ్వ హిందూ పరిషత్ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేశ్, పవన్ కల్యాణ్ కలసి నటిస్తున్న 'గోపాల గోపాల' చిత్రానికి కూడా వీహెచ్ పీ సెగ తగిలింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా ఉందంటూ మాసాబ్ ట్యాంక్ లోని సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దంటూ ధర్నా చేస్తున్నారు. వెంటనే పోలీసులు వచ్చి వారిని అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News