: 'షమితాబ్'లో అమితాబ్ పాట


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం 'షమితాబ్'. ఈ సినిమాలో అమితాబ్ ఓ పాట పాడడం విశేషం. రెండున్నర నిమిషాల నిడివి గల 'పిడ్లీ సే బాతే' అనే ఈ గీతం తాలూకు లింక్ ను 'బిగ్ బి' తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. యూట్యూబ్ లో కూడా ఈ పాట వీడియోను పోస్టు చేశారు. ఓ టాయిలెట్ సీట్ పై కూర్చుని అమితాబ్ ఈ పాటను ఆలపించడం వీడియోలో చూడొచ్చు. ఆర్.బల్కి దర్శకత్వంలో రూపొందుతున్న 'షమితాబ్' వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల అవుతుందని భావిస్తున్నారు. ధనుష్, అక్షర హాసన్ కూడా నటిస్తున్నారు. గతవారమే ఈ సినిమా తొలి ఆడియో పోస్టర్ ను అమితాబ్ ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News