: శత్రువులపై విరుచుకుపడండి... సైన్యంతో రక్షణ మంత్రి
సరిహద్దుల్లో చొరబాట్లపై, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తీవ్రంగా స్పందించారు. భారత జవాన్లపై కాల్పులకు తెగబడే పాక్ దళాలపై రెట్టింపు వేగంతో విరుచుకుపడాలని ఆయన సలహా ఇచ్చారు. జమ్మూ జిల్లా పల్లన్వాల్ సెక్టార్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను గాయపడిన ఘటనపై పారికర్ స్పందించారు. గడచిన వారం వ్యవధిలో పాకిస్థాన్ ఐదుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించిందని ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదులందరినీ ఏరివేయాల్సిందేనని పారికర్ సైన్యాన్ని ఆదేశించారు.