: 'కూడంకుళం' ఇక కమర్షియల్!
ఆరంభమైన నాటి నుంచి ఒడిదుడుకుల్లో సాగుతున్న కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం కమర్షియల్ బాట పట్టింది. ఇకపై ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తును విక్రయించనున్నారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ఆరంభమైంది. రష్యా సహకారంతో నిర్మించిన ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సామర్థ్యం 1000 మెగావాట్లు. రూ. 8000 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించారు. తమిళనాట దీని నిర్మాణాన్ని పలు పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా, మరమ్మతుల అనంతరం నేడు సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఈ కేంద్రం ద్వారా తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ తదితర దక్షిణాది రాష్ట్రాలకు కరెంటు సరఫరా చేస్తారు. 2015లో ఇక్కడే మరో యూనిట్ ను ప్రారంభించనున్నారు. అందుకోసం రష్యా నుంచి మరో 14 రియాక్టర్లను దిగుమతి చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది.