: 20 రోజుల్లో ప్రభుత్వం ఏర్పడకుంటే కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన!
జనవరి 19లోగా జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంది. ఎన్నికల ఫలితాలు వెల్లడై వారం రోజులు దాటినా ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనుమానాలు మాత్రం తీరలేదు. బీజేపీతో కలిసేందుకు పీడీపీ అధినేత్రి సుముఖంగానే ఉన్నా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నిరాకరిస్తున్నారు. కాగా, నేటి ఉదయం పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. కాశ్మీర్లో అతిపెద్ద పార్టీగా 28 స్థానాలతో పీడీపీ, రెండో స్థానంలో 25 అసెంబ్లీ సీట్లతో బీజేపీ నిలిచిన సంగతి తెలిసిందే. మొత్తం 87 మంది సభ్యులున్న అసెంబ్లీలో బలనిరూపణకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.