: వివాదాల ద్వారానే నేను కోరుకున్నదంతా సాధించాను: పూనమ్ పాండే


సోషల్ మీడియా వివాదాస్పద తారగా పేరు సంపాదించిన మోడల్, నటి పూనమ్ పాండే ఇక నుంచి వివాదాలకు దూరంగా ఉంటానని అంటోంది. ఇప్పటివరకు తాను సంపాదించుకున్న పేరంతా, గతంలోని వివాదాల ద్వారానే వచ్చిందని చెప్పింది. "ఒకానొక సమయంలో నేను వివాదాన్నే సాధనంగా ఎంచుకున్నా. దాంతో చాలా వరకు నాకు వర్క్ దొరికింది. ప్రస్తుతానికి దేనినీ వివాదాస్పదం చేయాల్సినంత అవసరం లేదు" అని తెలిపింది. 'మాలిని అండ్ కంపెనీ' అనే చిత్రం ద్వారా పూనమ్ తెలుగులో పరిచయమవుతోంది. ఈ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పూనమ్ పైవిధంగా మాట్లాడింది.

  • Loading...

More Telugu News