: భారత్ కు పుతిన్ భరోసా
పాకిస్థాన్ కు ఆయుధాలు సరఫరా చేయాలన్న తమ నిర్ణయంతో భారత్ కు నష్టం వాటిల్లబోదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ అంశం రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేయబోదని ఈ మేరకు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు. ఈ నెలలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పాక్ తో ఒప్పందాలపై మోదీతో పుతిన్ మాట్లాడినట్టు దౌత్య వర్గాలు తెలిపాయి. ఆ సమావేశంలోనే మోదీకి ఆయన భరోసా ఇచ్చారని పేర్కొన్నాయి. అంతకుముందు, పాక్ కు ఆయుధాలు విక్రయించేందుకు రష్యా ప్రతిపాదన చేయడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో, పుతిన్ స్వయంగా భారత ప్రధానికి వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత్ ప్రయోజనాలు దెబ్బతినే విధంగా రష్యా ఎలాంటి నిర్ణయం తీసుకోదని పుతిన్ ప్రధాని మోదీతో చెప్పారట.