: కొత్త సంవత్సరంలో కొత్త వడ్డన... పెరగనున్న కార్లు, టీవీల ధరలు!
భారత ప్రజలకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే మోదీ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. జనవరి 1 నుంచి వాహన, వినియోగ వస్తు రంగాలకు ఇస్తున్న ఎక్సైజ్ సుంకం రాయితీలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇదే జరిగితే ద్విచక్ర వాహనాలు, టీవీలు, ఎసీలు తదితరాల ధరలు పెరగనున్నాయి. గడచిన జూన్ లో మోదీ ప్రమాణ స్వీకారం తరువాత ఎక్సైజ్ సుంకాల్లో రాయితీలను డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ రాయితీలను మరోసారి పొడిగించేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం. దీంతో పలు వస్తువులు, వాహనాల ధరలు 3 నుంచి 6 శాతం పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.