: ‘ఎన్ కౌంటర్’ కేసులో అమిత్ షాకు ఊరట: యూపీఏ కుట్ర బయటపడిందన్న అరుణ్ జైట్లీ


సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభించింది. కేసు విచారణలో అమిత్ షాను విచారించడం కుదరదని ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో తన ప్రమేయం లేదని, కేసు నుంచి తనను తప్పించమని అమిత్ షా ఈ ఏడాది మార్చిలో కోర్టును అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై కోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేని నేపథ్యంలో షాను ఈ కేసు నుంచి తప్పిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో నరేంద్ర మోదీ సర్కారు, కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగిన యూపీఏ పాలనపై నిప్పులు చెరిగింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే నాడు ఈ కేసులో అమిత్ షాను ఇరికించారని కోర్టు తీర్పుతో స్పష్టమవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. ‘‘మీరు చెప్పినట్లుగా అమిత్ షాను అరెస్ట్ చేసేందుకు తగినంత మేర ఆధారాలు లేవు’’ అంటూ నాటి సీబీఐ డైరెక్టర్ సహా, దర్యాప్తు సంస్థ న్యాయ విభాగాలు నాటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాయని కూడా జైట్లీ చెప్పుకొచ్చారు. కేసులో ఏమాత్రం ప్రమేయం లేకున్నా అమిత్ షాను ఇరికించడం ద్వారా నాటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీకి కూడా కేసు మకిలి అంటించేందుకు కాంగ్రెస్ యత్నించిందనడానికి ఇంతకన్నా సాక్ష్యాలేం కావాలని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News