: అంత అద్భుతమైన పాత్ర కోసం ఆ కష్టం సరైనదే: విక్రమ్
సినిమా చూస్తే తాను ఎందుకు అంత కష్టపడ్డానో తెలుస్తుందని 'ఐ' సినిమా హీరో విక్రమ్ తెలిపాడు. తాను సన్నబడడానికి పడ్డ కష్టం చెప్పడం కష్టమని ఆయన చెప్పాడు. పగలంతా బాగున్నప్పటికీ రాత్రి పూట కష్టంగా ఉండేదని విక్రమ్ వెల్లడించాడు. తాను గంటల తరబడి మేకప్ వేసుకుని షాట్ కు సన్నద్ధమయ్యేవాడినని విక్రమ్ వివరించాడు. శంకర్, పీసీ శ్రీరామ్ తో పని చేయడం తన అదృష్టమని విక్రమ్ వెల్లడించాడు. సినిమా కోసం తాను పడ్డ కష్టం సినిమా చూస్తే తెలుస్తుందని విక్రమ్ చెప్పాడు.