: ఎయిర్ ఏషియా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
ఇండోనేషియాలోని జావా సముద్రంలో ఎయిర్ ఏషియా విమానం గల్లంతైన ఘటన మర్చిపోకముందే ఫిలిప్పీన్స్ లో ఎయిర్ ఏషియా జెస్ట్ విమానానికి ప్రమాదం తృటిలో తప్పింది. మనీలా నుంచి కలిబోకు చేరుకున్న విమానం ల్యాండ్ అవుతుండగా, రన్ వే నుంచి దూసుకెళ్లి పక్కనున్న బురదలో కూరుకుపోయింది. ఈ సమయంలో విమానంలో 159 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని విమానాశ్రయాధికారులు స్పష్టం చేశారు.