: డీజీపీ నియామకంపై ఎమ్మెల్యే కొడాలి నాని పిటిషన్ కొట్టివేత


ఆంధ్రప్రదేశ్ డీజీపీగా రాముడు నియామకం చెల్లదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ రాముడు నియామకంటో అభ్యంతరాలుంటే మొదట ట్రైబ్యునల్ కు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని న్యాయస్థానం కొడాలి నానిని ప్రశ్నించింది. ప్రజా ప్రతినిధిగా ఉంటూ న్యాయస్థానం సమయం వృధా చేశారని మండిపడింది. కాగా, డీజీపీల నియామకంపై ఏవైనా అభ్యంతరాలుంటే మొదటి ట్రైబ్యునల్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరువాతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News