: అన్ని రాష్ట్రాలూ విమానాశ్రయాలు కావాలంటున్నాయి: అశోక్ గజపతిరాజు


దేశంలోని అన్ని రాష్ట్రాలూ కొత్త విమానాశ్రయాలు కావాలంటున్నాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విమానయానంలోని కొత్త విధానాలపై రాష్ట్రాల అభిప్రాయాలను సేకరిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడకు కనెక్టివిటీ పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మధ్యనే రాజమండ్రి విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ ప్రారంభించామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News