: భూముల క్రమబద్ధీకరణకు కేసీఆర్ ఆమోదం... విధివిధానాలు ఖరారు


తెలంగాణ రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఈ అంశంపై అధికారులతో జరిపిన సమీక్షలో క్రమబద్ధీకరణ, దానికి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. అనంతరం, పూర్తి విధివిధానాలను ఖరారు చేశారు. పేదలు ఉండే 125 గజాలలోపు స్థలాలకు ఉచిత రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 250 గజాలలోపు భూములకు 50 శాతం, 500 గజాలలోపు భూములకు 75 శాతం, ఐదువందల గజాలు దాటిన నివాస స్థలాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధర చెల్లించాలని ప్రభుత్వం తెలిపింది. కమర్షియల్ స్థలం అయితే వందశాతం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని చెప్పింది. క్రమబద్ధీకరణకు 2014 జూన్ 2ను కటాఫ్ గా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాయంత్రం భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. జీవో విడుదలయ్యాక 20 రోజుల్లోపు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు ఈ క్రమబద్ధీకరణను పర్యవేక్షిస్తారని తెలిపింది.

  • Loading...

More Telugu News