: పోలీసులు ఇంటికి వచ్చారన్న అవమానంతో ఆత్మహత్యాయత్నం
పోలీసులు ఇంటికి రావడాన్ని అవమానంగా భావించిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా మధురవాడలో జరిగింది. వివరాల్లోకి వెళితే... దంపతుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. తన భర్తతో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భార్య పోలీసులతో మొరపెట్టుకుంది. దీంతో, విషయం తెలుసుకునేందుకు పోలీసులు వారి ఇంటికి వెళ్లారు. దీన్ని అవమానంగా భావించిన ఆమె భర్త గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.