: ఆ రికార్డు ధోనీ పేరిటే ఉంది!


సిరీస్ ఓటమితో టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పినా, ఆ ఫార్మాట్లో ధోనీ తనదైన ముద్ర వేశాడనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు ధోనీ పరమయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో 10000 కు పైగా పరుగులు సాధించిన తొలి భారత కెప్టెన్ ధోనీనే. అన్ని ఫార్మాట్లలో కలిపి ధోనీ 13917 పరుగులు సాధించాడు. ఈ క్లబ్ లో రికీ పాంటింగ్ (15440), గ్రేమ్ స్మిత్ (14878), స్టీఫెన్ ఫ్లెమింగ్ (11561), అలెన్ బోర్డర్ (11062) ఉన్నారు. ఇక, ఒకే ఇన్నింగ్స్ లో 9 క్యాచ్ లు పట్టిన భారత వికెట్ కీపర్ ధోనీ ఒక్కడే. ఈ అంశంలో ధోనీ ఓవరాల్ గా మూడోవాడు. ధోనీ కంటే ముందు డేవిడ్ ముర్రే, రిడ్లే జాకబ్స్ ఈ ఘనత సాధించారు. ముర్రే, జాకబ్స్ ఇద్దరూ వెస్టిండియన్లే.

  • Loading...

More Telugu News