: చివరి టెస్టులో టీమిండియా కెప్టెన్ గా కోహ్లీ


ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ధోనీ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంతో సెలక్టర్లు అతని స్థానంలో కోహ్లీని నియమించారు. సిరీస్ లో చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ జనవరి 6 నుంచి సిడ్నీలో జరగనుంది. ధోనీ గైర్హాజరీలో పలు మ్యాచ్ లలో జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన కోహ్లీపైనే బీసీసీఐ నమ్మకముంచింది. సిరీస్ అనంతరం జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News