: జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ను కలసిన బీజేపీ నేతలు


జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను బీజేపీ నేత రాం మాధవ్, ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జుగల్ కిశోర్ ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమ ప్రతిపాదనలను గవర్నర్ కు తెలిపినట్టు సమాచారం. ఇప్పటికీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా... పీడీపీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీలతో కలసి భారీ సంకీర్ణంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తోంది. గ్రాండ్ అలయెన్స్ (కూటమి)తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే జమ్ము, కాశ్మీర్, లడక్ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహించవచ్చని పీడీపీ అధినేత ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

  • Loading...

More Telugu News