: చైనాలో మరణించిన హాంకాంగ్ తొలి గూఢచారి
హాంకాంగ్ తొలి గూఢచారిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్ త్సాంగ్ చావో-కో తన 91 ఏళ్ల వయసులో అనారోగ్య కారణంగా మరణించినట్టు చైనా వార్తా సంస్థలు వెల్లడించాయి. కమ్యూనిస్ట్ చైనా తరఫున బ్రిటీష్ పాలన సాగుతున్న ప్రాంతాల్లో ఆయన గూఢచర్యం చేసినట్టు ఆరోపిస్తూ, 1961 కోల్డ్ వార్ (ప్రచ్ఛన్న యుద్ధం) సమయంలో జాన్ త్సాంగ్ ను బ్రిటన్ అదుపులోకి తీసుకోవడంతో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. కేంబ్రిడ్జి వర్శిటీలో విద్యను అభ్యసించిన ఆయన చైనా పోలీసు శాఖలో పనిచేస్తుండేవారు. హాంకాంగ్ లో బ్రిటన్ దళాలకు పట్టుబడ్డ ఈయన సుమారు 2 నెలల పాటు బ్రిటిష్ వారు అందించే పానీయాలను నిరాకరిస్తూ గడిపారట. ఆపై ఎటువంటి ఆధారాలూ లభించకపోవడంతో, విచారణ లేకుండానే అతన్ని విడిచిపెట్టినట్టు హాంకాంగ్ పత్రిక ఒకటి తెలిపింది. ఆయన మృతిపట్ల చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సంతాపం తెలుపడంతో పాటు నిన్న జరిగిన సంస్మరణ సభలో పాల్గొని నివాళులు అర్పించారు.