: టీ మంత్రులు కేటీఆర్, పోచారంలను అడ్డుకున్న ఏబీవీపీ: సిరిసిల్లలో ఉద్రిక్తత


తెలంగాణ మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాసరెడ్డిలకు కొద్దిసేపటి క్రితం సిరిసిల్లలో చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్లకు వచ్చిన మంత్రులిద్దరినీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను నిలువరిచేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం నేతలు, పోెలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం నేతలు మంత్రులను అడ్డుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News