: రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణ అవసరం లేదు: కోడెల
నవ్యాంధ్ర కొత్త రాజధాని ప్రతిపాదిత మండలాల్లో రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. తుళ్ళూరు, ఉండవల్లి ప్రాంతాల్లో నిన్న తెల్లవారుజామున జరిగిన సంఘ వ్యతిరేక చర్యలను ఆయన ఖండించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ గమ్యం చాలా పెద్దదని ఆయన వివరించారు. అగ్ని ప్రమాదం ఘటన వెనుక ఎవరున్నారన్నది విచారణలో తేలుతుందని చెప్పారు. సత్తెనపల్లి మండలంలో 10 వేల మరుగుదొడ్లు నిర్మించాలనుకోగా, 100 రోజుల్లో 20 వేల టాయిలెట్ లను నిర్మించి ఇచ్చామని చెప్పారు.