: ‘ఎన్ కౌంటర్’లో అమిత్ షాకు ఊరట లభించేనా?


సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఊరట లభిస్తుందా? లేదా? అన్న విషయంపై నేటి ఉదయం నుంచి సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదని, ఈ నేపథ్యంలో కేసు నుంచి తనను తప్పించమని అమిత్ షా కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై కోర్టు నేడు తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి. సోహ్రబుద్దీన్, తులసి ప్రజాపతిలను గుజరాత్ పోలీసులు కాల్చి చంపి ఎన్ కౌంటర్ కట్టుకథ అల్లారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఘటన జరిగిన సందర్భంలో గుజరాత్ హోం మంత్రిగా అమిత్ షా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు పలువురు పోలీసు అధికారులనూ సీబీఐ తన చార్జీషీటులో చేర్చింది. అంతేకాక తాజాగా అమిత్ షా దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోరాదని సీబీఐ, కోర్టును కోరుతోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News