: గుజరాత్ పోలీసులకు హార్లే డేవిడ్సన్ బైకులు


గుజరాత్ పోలీసు శాఖ ఇటీవల విలాసవంతమైన హార్లే డేవిడ్సన్ బైకులు కొనుగోలు చేసింది. ఈ 'స్ట్రీట్ 750', 'సూపర్ లో' మోడల్ మోటార్ సైకిళ్లను రాష్ట్రంలోని పోలీసు అనుబంధ విభాగాలకు అందించనున్నారు. జనవరిలో గాంధీనగర్ లో జరిగే 'వైబ్రాంట్ గుజరాత్ సమ్మిట్-2015' సందర్భంగా వీఐపీ కాన్వాయ్ లలో వీటిని తొలిసారిగా ఉపయోగిస్తారు. అనంతరం, వీటిని వివిధ విభాగాలకు అందజేస్తారు. కాగా, 'స్ట్రీట్ 750' మోడల్ హార్లే డేవిడ్సన్ నుంచి మార్కెట్లోకి వచ్చిన చవకైన బైక్. దీని ధర రూ. 4.1 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్). ఇక, 'సూపర్ లో' మోడల్ బైకు ధర రూ. 5.71 లక్షలు (ఢిల్లీ ఎక్స్ షోరూమ్). హార్లే డేవిడ్సన్ బైకులను ఎన్నో దేశాల పోలీసులు వినియోగిస్తున్నారు. గుజరాత్ కూడా ఈ మోటార్ సైకిళ్లను దిగుమతి చేసుకోవడంతో వాటిని అధికారికంగా వినియోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. కాగా, దేశంలో ఈ ఆధునిక బైకులను ఉపయోగిస్తున్న తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలుస్తోంది. అయితే, ఎన్ని బైకులను కొనుగోలు చేశారన్న విషయం వెల్లడికాలేదు.

  • Loading...

More Telugu News