: శ్రీలంకలో సల్మాన్ ఖాన్ ప్రచారంపై వైగో ఆగ్రహం


శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహేంద్ర రాజపక్స తరపున బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడం వివాదాస్పదం అయింది. లంకలో తమిళులను చిత్ర హింసలకు గురిచేసి హతమార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ దేశ అధ్యక్షుడికి మద్దతుగా సల్మాన్ ఎలా ప్రచారం చేస్తారని ఎండీఎంకే అధినేత వైగో ప్రశ్నించారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఓ నమ్మక ద్రోహి అని విమర్శించారు. మరోవైపు ఈ వ్యవహారంపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సల్లూకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఇదిలా ఉంటే సల్మాన్ తో పాటు నటి జాక్వలైన్ ఫెర్నాండెజ్, మరో ఐదుగురు బాలీవుడ్ నటులు కూడా ప్రచారం చేస్తారట.

  • Loading...

More Telugu News