: ఒబామా గోల్ఫ్ మోజుతో పెళ్లి వేదిక మారింది!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు హవాయిలో ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఆస్వాదిస్తున్నారు. కైలువాలోని ఓ అద్దె నివాసంలో వారు బస చేశారు. ఈ క్రమంలో ఒబామాకు గోల్ఫ్ ఆడాలన్న కోరిక కలిగింది. అనుకున్నదే తడవుగా తన నివాసానికి దగ్గర్లోని కనోయి క్లిప్పర్ గోల్ఫ్ కోర్స్ (మిలిటరీ గోల్ఫ్ కోర్స్) ను ఎంచుకున్నారు. అయితే, ఓ జంట ఆ గోల్ఫ్ కోర్సు వేదికగా తమ పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుంది. ఆదివారం పెళ్లి చేసుకునేందుకు అంతా సిద్ధమైన దశలో శనివారం కొందరు అధికారులు వచ్చి పెళ్లి మరో చోట చేసుకోవాలని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తన స్నేహితులతో గోల్ఫ్ ఆడేందుకు వస్తున్నారని వివరించారు. దీంతో, వారు హతాశులయ్యారు. ఆ తర్వాత ఈ విషయం వైట్ హౌస్ వర్గాలకు తెలియడంతో వారు ఒబామాకు వివరించారు. దీంతో, ఆయన వధువుకు క్షమాపణలు చెప్పారు. అంతేగాకుండా, పెళ్లి శుభాకాంక్షలు కూడా తెలిపారు. కాగా, వధూవరులు అమెరికా సైన్యంలో కెప్టెన్లుగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News