: కాంగ్రెస్ పథకాలనే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోంది: షీలా దీక్షిత్
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పథకాలనే ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అన్నారు. ఢిల్లీలోని 895 అనధికార కాలనీలను కేంద్ర ప్రభుత్వం క్రమబద్థీకరిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న(సోమవారం) ప్రకటించడంపై షీలా పైవిధంగా స్పందించారు. నగరంలో కాలనీల క్రమబద్ధీకరణ కాంగ్రెస్ పాలనలోనే మొదలైందన్నారు. తమ అభివృద్ధి పనులను కేంద్రం ముందుకు తీసుకువెళుతుండటం తమకు ఎంతో గౌరవంగా ఉందని చెప్పారు.