: కోహ్లీ ఔట్... భారత్ 104/4
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ పరాజయం దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. క్రీజులో కుదురుకున్నాడనుకున్న కోహ్లీ ఔట్ కావడంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో నిశ్శబ్దం ఆవరించింది. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ పెవిలియన్ చేరాడు. హారిస్ విసిరిన గుడ్ లెంగ్త్ డెలివరీని... కోహ్లీ ఫ్లిక్ చేశాడు. బంతి నేరుగా స్వేర్ లెగ్ లో ఉన్న బర్న్స్ చేతిలో వాలింది. దీంతో, భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 34 పరుగులతో క్రీజులో ఉన్న రహానేకు ఛటేశ్వర్ పుజారా జతకలిశాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 105 పరుగులు.