: హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కలకలం... ఆస్పత్రుల నుంచి ఇద్దరు రోగుల అదృశ్యం


హైదరాబాద్ ను స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. నెల రోజుల వ్యవధిలోని 20 మందికి వ్యాధి సోకగా వారిలో ఇప్పటికే నలుగురు మృత్యువాతపడ్డారు. నగరంలోని ఆస్పత్రులకు జిల్లాల నుంచి వస్తున్న స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఓ వైపు పెరుగుతున్న రోగులకు చికిత్స అందించడంలో నానా ఇబ్బందులు ఎదురవుతుండగా, స్వైన్ ఫ్లూ బారిన పడిన ఇద్దరు రోగులు ఆస్పత్రుల నుంచి అదృశ్యమైన ఘటన నేటి ఉదయం వెలుగు చూసింది. గాంధీ ఆస్పత్రి నుంచి ఒకరు, నగరంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రి నుంచి మరొకరు అదృశ్యమయ్యారు. చికిత్స పూర్తి కాకుండానే ఇద్దరు రోగులు అదృశ్యమవడంతో వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు రోగుల కారణంగా మరింత మంది వ్యాధి బారిన పడే ప్రమాదముందన్న వార్తల నేపథ్యంలో నగరంలో భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News