: అవి విభేదాలు కాదు...సమన్వయ లోపం: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ నేతల్లో విభేదాలు లేవని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఇటీవల జరిగిన బహిరంగ సభలో విజయవాడ అభివృద్ధిపై స్థానిక ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన విజయవాడకు చెందిన టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతల మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. సమన్వయ లోపం కారణంగా వ్యతిరేక భావనలు తలెత్తాయే కానీ, విభేదాలు కావని ఆయన వివరించారు.