: తెలంగాణలో ఎంసెట్ మేమే నిర్వహించుకుంటాం: పాపిరెడ్డి
రెండు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ పరీక్ష నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి ఈ రోజు తేదీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో తాజాగా తెలంగాణ ఉన్నత విద్యామండలి విభేదించింది. ఏపీ ఉన్నత విద్యామండలి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని మీడియా సమావేశంలో ఆరోపించారు. తెలంగాణ విద్యార్థులకు ఎంసెట్ తామే నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎంసెట్ కు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారని చెప్పారు. త్వరలోనే ఎంసెట్ తేదీలను ప్రకటిస్తామన్నారు.