: పాక్ రాయబారికి సమన్లు జారీచేసిన భారత్
ముంబయి పేలుళ్ల కేసులో నిందితుడు లఖ్వీ బెయిలు వ్యవహారంపై పాక్ హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ఆ దేశ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఇటీవల పాక్ హైకోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేయగా, అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అతడిని ప్రత్యేక చట్టం కింద జైలులోనే నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తాము బెయిలు ఇచ్చినా లఖ్వీని జైలులో ఉంచడంపై నేటి ఉదయం పాక్ హైకోర్టు మండిపడింది. సాయంత్రంలోగా లఖ్వీ విడుదల అవుతాడని భావిస్తున్న సమయంలో భారత విదేశాంగశాఖ తమ నిరసన తెలిపేందుకు ఈ సమన్లను జారీ చేసినట్టు తెలుస్తోంది.