: చివరి రోజు ఛేజింగ్ రసవత్తరం: అశ్విన్


మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఇప్పటికే డ్రైవర్ సీటు ఆక్రమించింది! 326 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్ పై పట్టు బిగించింది. కాగా, నాలుగో రోజు ఆట అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, చివరి రోజున ఛేజింగ్ రసవత్తరంగా ఉంటుందని అన్నాడు. లక్ష్య ఛేదనపై భారత జట్టు సానుకూల దృక్పథంతో ఉందని స్పష్టం చేశాడు. అయితే, ఈ మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేయలేమని, తాము మాత్రం పోరాడతామని తెలిపాడు. "టార్గెట్ ఎంతైనా, మ్యాచ్ కు ఆఖరి రోజున ఛేజింగ్ అంటే ఆసక్తికరంగానే ఉంటుంది. నైపుణ్యానికి, దృక్పథానికి ఇది 'టెస్టు' అనుకోవాల్సి ఉంటుంది. కష్టమైనా అందుకు మేం సిద్ధంగానే ఉన్నాం. గెలిచేందుకే ఇక్కడికి వచ్చాం" అని తెలిపాడు.

  • Loading...

More Telugu News