: బంగాళాఖాతంలో అల్పపీడనం... అసలే చలి, ఆపై వర్షం!


దేశం మొత్తం చలిపులి ధాటికి గజగజ వణుకుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దానికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో, శ్రీలంక, తమిళనాడుపై అల్పపీడనం ప్రభావం పడనుంది. దక్షిణ కోస్తాపైనా దీని ఎఫెక్ట్ ఉంటుందట. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో, రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, తీరం వెంబడి 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. తాజా వాతావరణ పరిస్థితుల కారణంగా చలి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News